anajali: భయపడుతూనే భయపెట్టేస్తోన్న అంజలి .. 'లిసా' టీజర్!

  • అంజలి కథానాయికగా 'లిసా'
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకు

తమిళంలో అంజలి ప్రధాన పాత్రగా 'లిసా' అనే హారర్ థ్రిల్లర్ మూవీ నిర్మితమైంది. తెలుగులోను ఈ సినిమా అదే పేరుతో పలకరించనుంది. రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, బ్రహ్మానందం ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హారర్ థ్రిల్లర్ జోనర్లో రానున్న మొదటి 3డీ సినిమా ఇదే. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు.

ఊరికి దూరంగా వున్న ఒక పాడుబడిన ఇంట్లోకి అంజలి వెళ్లవలసి వస్తుంది. ఆ ఇంట్లో జరిగే సంఘటనలు ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని గ్రహించిన ఆమె భయంతో కంపించిపోతుంది. 'ఆ ఇంట్లో రాత్రి 10 తరువాత ఎలాంటి పరిస్థితుల్లోనూ లైట్ వేయకూడదు' అనే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. హారర్ జోనర్లో సినిమాలు చేయడం అంజలికి అలవాటే .. అందువలన ఈ సినిమాలో ఆమె తన పాత్రలో జీవించిందనే విషయం తెలిసిపోతూనే వుంది. 

More Telugu News