Shriya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'దాన వీర శూర కర్ణ' పాటలో శ్రియ 
  • చిత్ర నిర్మాణానికి దూరంగా 'బిచ్చగాడు' హీరో 
  • 'ఆర్ ఎక్స్ 100'దర్శకుడి తాజా చిత్రం
  • సుమంత్ 'ఇదం జగత్' విడుదల తేదీ 

*  క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం తాజాగా ఓ పాటను చిత్రీకరించారు. 'దాన వీర శూర కర్ణ' చిత్రంలోని 'చిత్రం భళారే విచిత్రం' అనే పాటను బాలయ్య, శ్రియ జంటపై చిత్రీకరించారు.
*  'బిచ్చగాడు' సినిమాతో హీరోగా మారిన సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని ఆ తర్వాత పలు చిత్రాలు నిర్మించాడు. తాజాగా ఆయన నటించిన 'రోషగాడు' చిత్రానికి కూడా నిర్మాత అతనే. అయితే, ఇకపై చిత్ర నిర్మాణానికి దూరంగా వుండి, కేవలం నటనపైనే దృష్టి పెట్టాలని విజయ్ నిర్ణయించుకున్నాడట.
*  తొలిచిత్రం 'ఆర్ఎక్స్ 100'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. దీని స్క్రిప్ట్ రెడీ అయిందని, ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన త్వరలో ఉంటుందని తెలుస్తోంది.
*  సుమంత్ హీరోగా అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇదం జగత్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.

More Telugu News