Telugudesam: సీబీఐ దర్యాప్తునకు పది రాష్ట్రాలే సాధారణ అనుమతినిచ్చాయి: ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు

  • మిగిలిన రాష్ట్రాల్లో దర్యాప్తునకు అనుమతి తప్పనిసరి
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాధారణ అనుమతివ్వలేదు
  • కోర్టులు ఆదేశిస్తే సీబీఐ ఎక్కడైనా దర్యాప్తు చేయొచ్చు

ఏపీలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకు సాధారణ అనుమతి ఉపసంహరణపై ప్రతిపక్షాలు చేస్తున్న  విమర్శలు, ఆరోపణలపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తు చేసేందుకు దేశంలోని పది రాష్ట్రాలే సాధారణ అనుమతి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

మిగిలిన రాష్ట్రాల్లో సీబీఐ దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సీబీఐకి సాధారణ అనుమతి ఇవ్వలేదని, కోర్టులు ఆదేశిస్తే సీబీఐ ఎక్కడైనా దర్యాప్తు చేయవచ్చని తెలిపారు. ఢిల్లీ పోలీస్ చట్టం చదివితే సీబీఐ పరిధి ఏంటన్నది తెలుస్తుందని విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు కుటుంబరావు సూచించారు.

More Telugu News