Komatireddy Venkat Reddy: కూటమి అధికారంలోకి రాకపోతే నేనూ రాజకీయాల్లో ఉండను: కేటీఆర్ సవాల్‌కు కోమటిరెడ్డి ప్రతి సవాల్

  • సీట్ల కేటాయింపులో ఉద్యమకారుల గొంతుకోసింది
  • సామాజిక న్యాయం పాటించాం
  • బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాం

ఇటీవల టీఆర్ఎస్ నేత కేటీఆర్ తమ పార్టీ ఓటమి పాలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. ఇకపై తాను రాజకీయాల్లో కనిపించను.. వినిపించను.. అంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేటీఆర్ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్ని కుయుక్తులు పన్నినా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

సీట్ల కేటాయింపులో టీఆర్ఎస్ ఉద్యమకారుల గొంతుకోసిందని ఆరోపించారు. మహాకూటమి అధికారంలోకి రాకపోతే తాను కూడా రాజకీయాల్లో ఉండబోనని ప్రతి సవాల్ విసిరారు. తాము టికెట్ల కేటాయింపు విషయంలో సామాజిక న్యాయం పాటించామని.. ఎక్కువ సీట్లు బీసీలకు కేటాయించామని వెల్లడించారు. నల్లగొండలో మెజార్టీ సీట్లను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే తెలంగాణలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని వెల్లడించారు.

More Telugu News