KCR: బీజేపీతో కలిసేది లేదు.. కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయం: కేటీఆర్

  • బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య సిద్ధాంతపరమైన విరోధం
  • జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నాం
  • సిద్ధిపేటలో ఇక్బాల్ మీనార్‌ను కేసీఆరే కట్టించారు

ఈ ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయమని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ మైనారిటీ నేతలు అబిద్‌ రసూల్‌ఖాన్‌, ఖలీల్‌ ఉర్‌ రెహమాన్‌, వారి అనుచరులు టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. సరైన సమయంలో టీఆర్ఎస్‌లో చేరినందుకు అభినందించారు.

కేసీఆర్‌ను మించిన లౌకికవాది మరొకరుండరని.. సిద్ధిపేటలో ఇక్బాల్ మీనార్‌ను కట్టించింది ఆయనేనని గుర్తు చేశారు. షాదీ ముబారక్, మైనార్టీల కోసం 200లకు పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు, ముస్లింలకు పండుగలను జరుపుకునేందుకు చేయూత వంటి ఎన్నో కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య సిద్ధాంతపరమైన విరోధముందని, ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. 16 ఎంపీ సీట్లు గెలిచి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్టు ఆయన తెలిపారు.

More Telugu News