venu madhav: వేణుమాధవ్ నామినేషన్ పత్రాలను తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి

  • కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేణుమాధవ్
  • నామినేషన్ పత్రాలు సరిగా లేకపోవడంతో.. తిరస్కరణ 
  • రేపు లేదా ఎల్లుండి.. మళ్లీ నామినేషన్ వేస్తానన్న వేణు

కోదాడ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లిన ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ కు షాక్ తగిలింది. కోదాడ తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన ఆయన... పత్రాలను అధికారులకు సమర్పించారు. అయితే, అవి సరిగా లేకపోవడంతో... నామినేష్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో, వేణుమాధవ్ తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్తి స్థాయిలో పత్రాలను తయారు చేసుకుని... రేపు కానీ, ఎల్లుండి కానీ మళ్లీ నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ అనే సంగతి తెలిసిందే. కోదాడ నుంచి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

More Telugu News