mahakutami: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత : నామా నాగేశ్వరరావు

  • మహా కూటమికి ఓట్ల వర్షం కురిపించేది అదే
  • జనం కూటమి అభ్యర్థుల గెలుపు కోరుకుంటున్నారు
  • చంద్రబాబు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారనడం సరికాదు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతే మహాకూటమి అభ్యర్థులకు ఓట్ల వర్షం కురిపిస్తుందని ఖమ్మం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మహా కూటమి పట్ల జనంలో ఆసక్తి ఉందని, కూటమి అభ్యర్థుల విజయాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలుగుదేశం భాగస్వామ్యం ఉందని, బిల్లుపై తొలి సంతకం చేసింది తానేనని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే, తెరాస ప్రభుత్వం ఇవేవీ సాధించలేక పోయిందని విమర్శించారు.

రాష్ట్రంలో నిరుద్యోగం పెచ్చుమీరి యువత అసహనంతో ఉన్నారని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారనడం సరికాదన్నారు. మహా కూటమి నూరు శాతం విజయవంతం అవుతుందన్నారు. ఈనెల 19న నామినేషన్‌ దాఖలు చేస్తానని చెప్పారు.

More Telugu News