BJP: 20 మందికి టికెట్లు కేటాయిస్తూ బీజేపీ మూడో జాబితా విడుదల

  • జాబితా విడుదల చెసిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి నడ్డా 
  • గడచిన రెండు జాబితాల్లో 66 మందికి అవకాశం
  • తాజా జాబితాతో మొత్తం 86 మందికి టికెట్లు... 33 స్థానాలు పెండింగ్

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబరు 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీ  తన అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో 20 మందికి చోటు కల్పించింది. ఇంతకు ముందు విడుదల చేసిన రెండు జాబితాల్లో మొత్తం 66 మందికి సీట్లు కేటాయించిన అధిష్ఠానం తాజాగా ప్రకటించిన జాబితాతో మొత్తం 86 మందికి టికెట్లు ఇచ్చినట్టయింది. ఇంకా 33 మంది పేర్లు ప్రకటించాల్సి ఉంది.

తాజా జాబితాలో సీటు దక్కించుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డి- లక్ష్మారెడ్డి, వేములవాడ- ప్రతాపకృష్ణ,  హుజూరాబాద్- పుప్పలరఘు, హుస్నాబాద్- చాడ శ్రీనివాస్‌రెడ్డి, మెదక్- ఆకుల రాజయ్య, నారాయణ్‌ఖేడ్- జీ రవికుమార్‌గౌడ్, సంగారెడ్డి- బీ రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, పటాన్‌చెరు- పి.కరుణాకర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం- కోత అశోక్‌గౌడ్,  చేవెళ్ల(ఎస్సీ)- కంజర్లప్రకాశ్, నాంపల్లి- దేవర కరుణాకర్, సికింద్రాబాద్- సతీశ్‌గౌడ్, కొడంగల్- నాగూరావ్ నామాజీ, మహబూబ్‌నగర్- జి.పద్మజారెడ్డి, ఆలంపూర్(ఎస్సీ)- రజనీ మాధవరెడ్డి, నల్లగొండ- శ్రీరామోజు షణ్ముఖ, నకిరేకల్(ఎస్సీ)- కాసర్ల లింగయ్య, మహబూబాబాద్(ఎస్టీ)- జ్యోతుల హుస్సేన్‌నాయక్, ఖమ్మం- డాక్టర్ ఉప్పల శారద, మధిర- డాక్టర్ శ్యామలరావు ఉన్నారు.

More Telugu News