Gaja: తిరుపతిలో దంచికొడుతున్న వర్షం... భక్తులకు తీవ్ర ఇబ్బందులు!

  • గత రాత్రి తీరం దాటిన తుపాను
  • దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
  • పరిస్థితిని సమీక్షిస్తున్న చిత్తూరు కలెక్టర్

బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుపాను, గత రాత్రి తీరం దాటగా, దాని ప్రభావంతో దక్షిణ కోస్తాలోని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం నుంచి తిరుపతి, చిత్తూరు, పుంగనూరు, మదనపల్లి, నగరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.

ఇక తిరుమలలో కురుస్తున్న భారీ వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు వర్షపు జల్లుల్లో తడుస్తూనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గజ తుపాన్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే, కంట్రోల్ రూమ్ నంబర్ 08572-240500కు ఫోన్ చేస్తే, సహాయక బృందాలు వస్తాయని అన్నారు.

More Telugu News