nani: 'జెర్సీ' అవుట్ పుట్ పట్ల నాని సంతృప్తి

  • క్రికెట్ నేపథ్యంలో నాని  
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్
  • కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్

నాని కథానాయకుడిగా .. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కన్నడ కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ నాని సరసన నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చకచకా కొనసాగుతోంది. ఇంతవరకూ జరిగిన షూటింగ్ కి సంబంధించిన అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని నాని సంతృప్తిని వ్యక్తం చేశాడట.

ఈ కథ క్రికెట్ నేపథ్యంలోనిది కావడం ఒక విశేషమైతే, నాని డిఫరెంట్ లుక్స్ తో కనిపించనుండటం మరో విశేషం. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రధాన పాత్రను పోషించనున్నాయని అంటున్నారు. ఆ వైపు నుంచి కూడా పనులు వేగంగా జరగనున్నాయని చెబుతున్నారు. తన కెరియర్లో ఇది ఒక డిఫరెంట్ మూవీ అవుతుందని నాని భావిస్తున్నాడు.

More Telugu News