Chandrababu: ఉత్తరాంధ్ర సుజల ప్రాజెక్ట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

  • ఫేజ్-1ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం
  • ఈ ప్రాజెక్ట్ తో సస్యశ్యామలం అవుతుంది
  • మే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం

'బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టు ద్వారా విశాఖ జిల్లాలోని తొమ్మిది మండలాల్లోని లక్షా ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ ప్రాజెక్ట్ కు ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చోడవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్-1ను వీలైనంత త్వరగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.

 నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా నీటి కష్టాలు తొలగిస్తామని, మే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేశామని, ఈ నెలలోనే గోదావరి, పెన్నా నదులను కూడా అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్విభజన గురించి చంద్రబాబు ప్రస్తావించారు. విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని, రాష్ట్రానికి ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నా పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్తున్నానని అన్నారు.

More Telugu News