tpcc: కమ్మ సామాజికవర్గానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్

  • జెట్టి కుసుమకుమార్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన రాహుల్
  • ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న రేవంత్, పొన్నం
  • మూడుకు పెరిగిన వర్కింగ్ ప్రెసిడెంట్ల సంఖ్య

మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన ఒక్క నేత కూడా లేకపోవడం తెలిసిందే. దీనిపై రేణుకాచౌదరితో పాటు ఆ సామాజికవర్గానికి చెందిన పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. ఒక సీటును కూడా కేటాయించకుండా తమ సామాజికవర్గానికి తీరని అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో, బుజ్జగింపుల్లో భాగంగా, ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఆ సామాజికవర్గానికి ఒక పదవిని కట్టబెట్టింది. జెట్టి కుసుమకుమార్ ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నియమించారు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డిలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. తాజాగా కుసుమకుమార్ నియామకంతో వర్కింగ్ ప్రెసిడెంట్ ల సంఖ్య మూడుకు చేరుకుంది. 

More Telugu News