jyothika: నేను జ్యోతికకు పెద్ద ఫ్యాన్: మంచు లక్ష్మి

  • జ్యోతిక గొప్ప నటి 
  • కళ్లతోనే హావభావాలు పలికిస్తుంది 
  • ఆమెతో నటించడం అదృష్టం

తెలుగులో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ నటిగా మంచు లక్ష్మి మంచి పేరు తెచ్చుకుంది. పాత్రలో వైవిధ్యం ఉండాలే గానీ, ఇతర భాషా చిత్రాల్లోను చేయడానికి ఆమె ఉత్సాహాన్ని చూపుతోంది. ఈ కారణంగానే ఆమె తమిళంలో ఒక సినిమా చేస్తోంది .. ఆ సినిమా పేరే 'కాట్రిన్ మొళి'. జ్యోతిక కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో మంచు లక్ష్మి ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది.

ధనుంజయన్ - గోవింద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి రాధా మోహన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ .. " జ్యోతిక మంచి నటి .. ఎలాంటి హావభావాలనైనా ఆమె తన కళ్లతోనే పలికిస్తుంది. పాత్రలో ఆమె ఒదిగిపోయే తీరు నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆమెతో కలిసి పనిచేయడం నా అదృష్టం అనిపించింది. ఈ సినిమాలో జ్యోతికతో కలిసి నటించిన దగ్గర నుంచి నేను ఆమెకి పెద్ద ఫ్యాన్ ను అయిపోయాను" అని చెప్పుకొచ్చింది.  

More Telugu News