Hindupur: హిందూపురం వైపు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ!

  • హిందూపురం సరిహద్దులకు చేరిన కృష్ణ నీరు
  • మడకశిర సబ్ కెనాల్ ద్వారా పరుగులు
  • వారంలో చెరువులను నింపుతామంటున్న అధికారులు

వ్యవసాయ అవసరాల సంగతి దేవుడెరుగు... కనీసం తాగేందుకు మంచినీరైనా ఇప్పించండయ్యా... అని తమకు తారసపడిన నేతలకు విన్నవించే అనంతపురం జిల్లా హిందూపురం వాసుల దాహార్తి తీరనుంది. మడకశిర ఉప కాలువలో పరుగులు పెడుతున్న కృష్ణానది జలాలు హిందూపురం సరిహద్దులకు చేరాయి. దీంతో ఇప్పటివరకూ నీటి రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రజలు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు.

గత నెలాఖరులో గొల్లపల్లి జలాశయం నుంచి కృష్ణా నీటిని మడకశిర సబ్ కెనాల్ కు విడుదల చేసిన సంగతి తెలిసిందే. పెనుగొండ వద్ద కాలువ పనుల కారణంగా నీటిని గతంలో ఆపివేయడం, పెనుగొండ ప్రాంతంలో చెరువులను నింపాల్సి రావడంతో హిందూపురానికి నీటి తరలింపు సాధ్యం కాలేదు.

ఈ విషయంలో కల్పించుకున్న చంద్రబాబు, 20వ తేదీ నాటికి పట్టణానికి నీరివ్వాలని ఆదేశించడంతో, అధికారులు ఆగమేఘాల మీద కదిలారు. నేడు మండలంలోని చెలివెందులకు నీరు వస్తుందని అధికారులు తెలిపారు. మరో వారంలో నియోజకవర్గంలోని దాదాపు మొత్తం చెరువులకూ నీటిని అందిస్తామని అధికారులు అంటున్నారు.

More Telugu News