balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ లో మరో యంగ్ హీరోయిన్

  • షూటింగు దశలో ఎన్టీఆర్ బయోపిక్ 
  • కృష్ణకుమారి పాత్రలో మాళవిక నాయర్ 
  • త్వరలో ఆమెపై చిత్రీకరణ

ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఎప్పటికప్పుడు ఆర్టిస్టుల ఫస్టు లుక్స్ ను రిలీజ్ చేస్తూ క్రిష్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీదేవిగా రకుల్ .. జయప్రదగా తమన్నా .. సావిత్రిగా నిత్యామీనన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం మరో యంగ్ హీరోయిన్ ను కూడా తీసుకున్నారు .. ఆమె మాళవిక నాయర్!

ఎన్టీఆర్ సరసన కథానాయికగా కృష్ణకుమారి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అందువలన ఈ బయోపిక్ లో కృష్ణకుమారి పాత్ర కూడా కనిపించనుంది. ఆ పాత్రకి గాను మాళవిక నాయర్ ను తీసుకున్నారు. త్వరలోనే బాలకృష్ణ .. మాళవిక నాయర్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 

More Telugu News