Judge: అక్రమాస్తుల ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి అరెస్ట్.. కలకలం!

  • అర్ధరాత్రి న్యాయమూర్తి వరప్రసాద్ అరెస్ట్
  • రూ. 3 కోట్ల విలువైన అక్రమాస్తుల గుర్తింపు
  • 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు

రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్‌ ను, ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేయడం న్యాయ వర్గాల్లో కలకలం రేపింది. ఈ అర్థరాత్రి ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు, తెల్లవారుజామున 4 గంటల సమయంలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించడంతో, చంచల్‌గూడ జైలుకు ఆయన్ను తరలించారు.

నిన్న ఉదయం నుంచి వరప్రసాద్, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రభాకర్‌ నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగాపల్లి తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. వరప్రసాద్‌ వద్ద ప్రభుత్వ లెక్కల ప్రకారం, సుమారు 3 కోట్ల విలువైన స్థిర, చరాస్తుల్ని గుర్తించామని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 20 కోట్లకు పైగానే ఉంటుందని అన్నారు.

More Telugu News