Rahul Gandhi: ఉల్లి ఎలా పండుతుంది?.. రాహుల్‌ను ఎద్దేవా చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

  • గందరగోళంలో రాహుల్ బాబా
  • రైతులమైన మాకు పనామా అంటే కూడా ఏంటో తెలియదు
  • ఇలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని నడుపుతారట

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్షాలు విమర్శల్లో మరింత పదును పెంచాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనకు ఇక చరమగీతం పాడాలని గట్టి పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ఎత్తులు, పైఎత్తులతో బిజీగా ఉంది. అవకాశం చిక్కినప్పుడలా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై విరుచుకుపడుతోంది. మరోవైపు, ఈసారి కూడా గెలుపు తమదేనని విశ్వసిస్తున్న బీజేపీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి చౌహాన్ మాట్లాడుతూ రాహుల్‌ను ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీకి ఉల్లిపాయలు ఎలా పండుతాయో? ఎక్కడ పండుతాయో కూడా తెలియదన్నారు. అవి భూమిపైన పండుతాయో, లోపల పండుతాయో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు. పనామా పేపర్లలో తన కుమారుడి పేరు వచ్చిందని రాహుల్ ఆరోపిస్తున్నారని, రైతులమైన తమకు పనామా అంటే కూడా ఏమిటో తెలియదన్నారు. రాహుల్ బాబా తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ఇలా ఎప్పటికప్పుడు గందరగోళంలో ఉండే వాళ్లు ప్రభుత్వాన్ని ఏం నడుపుతారని శివరాజ్‌సింగ్ విమర్శించారు.

More Telugu News