నీకో అవకాశం కల్పిస్తా: గాయని పసల బేబీకి మురళీమోహన్ హామీ

15-11-2018 Thu 08:25
  • నెట్టింట పసల బేబి పాటలు వైరల్
  • సన్మానించిన ఎంపీ మురళీమోహన్
  • తనకున్న పరిచయాలతో అవకాశం ఇప్పిస్తానని హామీ

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పుణ్యమాని తన గాత్ర నైపుణ్యంతో పేరు తెచ్చుకున్న పసల బేబీకి సినిమాల్లో అవకాశం కల్పిస్తానని ఎంపీ, నటుడు మురళీమోహన్ వ్యాఖ్యానించారు. తాను గతంలో కొన్ని సినిమాలు తీశానని, ఇప్పుడు సినిమాలు తీయకపోయినా, తనకు పరిశ్రమలోని ప్రముఖులతో పరిచయాలున్నాయని, వాటి ద్వారా బేబీకి అవకాశం కల్పిస్తానని ఆయన అన్నారు.

రంగంపేట మండలం వడిశలేరులో ఆమెను సత్కరించి, నగదు ప్రోత్సాహకాన్ని అందించిన మురళీమోహన్, తన నియోజకవర్గ మహిళ, ఇలా సంగీత ప్రియులను ఆకట్టుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా బేబీ, మురళీమోహన్ చిత్రంలోని "ఏ రాగమో...ఇది ఏ తాళమో..." అన్న పాట పాడి అందరినీ అలరించింది.