Andhra Pradesh: మారిన ఆంధ్రప్రదేశ్ అధికార చిహ్నం!

  • ఐదున్నర దశాబ్దాల తరువాత చిహ్నం మార్పు
  • తెలుగు అక్షరాలతో చిహ్నం
  • పూర్ణకుంభం స్థానంలో పూర్ణఘటం

దాదాపు ఐదున్నర దశాబ్దాల తరువాత ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం మారింది. సరికొత్త చిహ్నాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పటివరకూ చిహ్నంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న ఆంగ్ల పదాన్ని తెలుగులోను, మరోవైపు ఆంగ్లంలో, ఇంకో వైపు హిందీలోనూ రాశారు. దిగువన ఉండే 'సత్యమేవ జయతే' అన్న పదాన్ని తెలుగులోకి మార్చారు.

 అమరావతి శిల్పకళలోని ధర్మ చక్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సరికొత్త చిహ్నాన్ని తయారు చేసినట్టు అధికారులు తెలిపారు. త్రిరత్నాలు (బుద్ధుడు, ధర్మం, సంఘం) పొదిగిన దండంతో ధర్మ చక్రాన్ని చిహ్నంలో ఏర్పాటు చేశారు. ఒకటో శతాబ్దంలో ధాన్యకటకంలో చైత్యానికి విధుకుడు అనే చర్మకారుడు బహూకరించినట్టు చరిత్ర చెప్పే పూర్ణఘటాన్ని మూడు వృత్తాల్లో వరుసగా అలంకరించారు. పూర్ణ ఘటక చిహ్నం కింద జాతీయ చిహ్నమైన అశోక స్తంభం ఉంటుంది. ఇక ఈ చిహ్నాన్ని మూడు రకాలుగా ముద్రించుకునేలా తయారు చేసినట్టు ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News