Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హిందీలో రకుల్ కి భారీ ఆఫర్ 
  • విశాఖకు చైతు, సమంతల 'మజిలి' 
  • కూతురుతో కలసి నటించిన లయ!
  • 'రోషగాడు' భారీ స్థాయిలో విడుదల

*  తెలుగులో అవకాశాలు లేకపోయినప్పటికీ, రకుల్ ప్రీత్ సింగ్ కి హిందీలో మాత్రం మంచి ఆఫర్లే వస్తున్నాయి. తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా సరసన 'మార్జావాన్' అనే సినిమాలో కథానాయికగా నటించే ఛాన్స్ కొట్టేసింది.
*  నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న 'మజిలి' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ నేటి నుంచి విశాఖలో జరుగుతుంది. ఈ నెల 19 వరకు జరిగే ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.  
*  నిన్నటితరం కథానాయిక లయ మళ్లీ తెరమీదకు వస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రంలో లయ ఓ ముఖ్య పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆమె కూతురు కూడా ఈ చిత్రం ద్వారా నటిగా పరిచయం అవుతోందని సమాచారం. చిన్నప్పటి ఇలియానా పాత్రలో ఆమె కనిపిస్తుందట.
*  విజయ్ ఆంటోని నటించిన తమిళ అనువాద చిత్రం 'రోషగాడు' ఈ నెల 16న రిలీజ్ అవుతోంది. విశేషం ఏమిటంటే, డబ్బింగ్ సినిమా అయినప్పటికీ, విజయ్ ఆంటోనికున్న క్రేజ్ ను బట్టి సుమారు 350 థియేటర్లలో దీనిని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.

More Telugu News