కోడికత్తి ఘటన ఓ హైలెవల్ డ్రామా.. నా ప్రమేయం నిరూపిస్తే ఉరేసుకుంటా: మంత్రి ఆదినారాయణ రెడ్డి

15-11-2018 Thu 06:26
  • నిరూపించలేకపోతే వారికే శిక్ష విధించాలి
  • జగన్ మాటలు, దాడి ఘటన అంతా డ్రామా
  • ప్రజాకోర్టులో నిజాలు తెలుస్తాయి

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి దాడి ఘటన ఓ హైలెవల్ డ్రామా అని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. జగన్ మాటలు, దాడి ఘటన అంతా డూప్ అని కొట్టి పడేశారు. ఈ దాడి వెనక తన హస్తం ఉందని నిరూపిస్తే ఉరేసుకుంటానని, నిరూపించలేకపోతే వైసీపీ నేతలకు ఏ శిక్ష విధించాలో వారే నిర్ణయించాలని సవాలు విసిరారు.

నిజానిజాలు ప్రజా కోర్టులోనే తెలుస్తాయన్న ఆయన ఈ కేసు విషయంలో ఏ ఆధారాలతో తనతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దాడి జరిగితే నవ్వుతూ విమానమెక్కి హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చేరడం అంతా ఒక డ్రామాగా మంత్రి అభివర్ణించారు.