rajani: సంక్రాంతికి పోటీ పడుతోన్న రజనీ .. అజిత్

  • కార్తీక్ సుబ్బరాజుతో రజనీ 
  • శివ దర్శకత్వంలో అజిత్ 
  • రెండు సినిమాలపై భారీ అంచనాలు  

రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ 'పేట్ట' సినిమా చేస్తున్నాడు. రజనీకాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా సిమ్రాన్ కనిపించనుంది. విజయ్ సేతుపతి .. నవాజుద్దీన్ సిద్ధిఖీ .. త్రిష కీలకమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఆ దిశగా ఈ సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.ఇక అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'విశ్వాసం' కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. అజిత్ సరసన కథానాయికగా నయనతార నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. అజిత్ ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి వుంది. స్టార్ హీరోల సినిమాలు రెండు ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో, అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలు రాబట్టనున్న వసూళ్లను గురించే కోలీవుడ్ కుర్రాళ్లు మాట్లాడుకుంటున్నారు.     

More Telugu News