Krishna District: పిల్లపామును కొట్టిచంపిన అవనిగడ్డ వాసులు... కోపంతో రెచ్చిపోయిన తల్లి నాగు!

  • యథేచ్ఛగా సంచరిస్తున్న సర్పాలు
  • బుసలు కొడుతూ పరుగులు పెట్టిన తల్లి పాము
  • దాన్ని కూడా కొట్టి చంపిన ప్రజలు

అవనిగడ్డ మరోసారి పాముల భయంతో వణికిపోతోంది. ఈ ప్రాంతమంతా యథేచ్ఛగా సర్పాలు సంచరిస్తుండగా, ఈ ఉదయం తమకు కనిపించిన ఓ పిల్లపామును కొందరు కొట్టిచంపడంతో, దాని తల్లి రెచ్చిపోయింది. కోపంతో బుసలు కొడుతూ, కనిపించిన వారిని కాటేసేందుకు ఉరుకులు పెట్టింది.

ఆ పాము పరుగులు చూసి తీవ్ర భయాందోళనకు ప్రజలు గురయ్యారు. ఈ ఘటన మోపిదేవి సమీపంలోని కోసూరివారిపాలెంలో జరిగింది. ఆ తల్లి పామును కూడా ప్రజలు కొట్టి చంపారు. ఈ ఉదయం నుంచి ప్రజలు 7 పాములను కొట్టి చంపారని వార్తలు వస్తున్నాయి. ఈ పాముల్లో విషపూరితమైనవి చాలా తక్కువని స్నేక్ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు చెబుతున్నా, భయంతో ఉన్న ప్రజలు కనిపించిన సర్పాన్ని కనిపించినట్టు కర్రలతో మోదుతున్నారు.

More Telugu News