Ramayan Express: నేటి నుంచి 'శ్రీ రామాయణ ఎక్స్ ప్రెస్'... విశేషాలివి!

  • నేడు ప్రారంభం కానున్న యాత్రికుల రైలు
  • ఇండియాలోని పలు పుణ్యక్షేత్రాల దర్శనం
  • రూ. 36,970 ధరపై శ్రీలంకకు కూడా

భారత ఉపఖండానికి, రామాయణానికి ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. అయోధ్యలో జన్మించిన శ్రీరాముడు, తన జీవితంలో మిథిల, కిష్కింధ, శ్రీలంక ప్రాంతాలను సందర్శించారు. ఈ క్రమంలో త్రేతాయుగానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు దేశంలో స్థిరపడి, ప్రముఖ సందర్శనీయ స్థలాలుగా ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుతూ, నేటి నుంచి ప్రత్యేక రైలు 'శ్రీ రామాయణ ఎక్స్ ప్రెస్' ప్రారంభం కానుంది. 16 రోజుల పాటు ఈ రైలు ఇండియాలోని పలు ముఖ్యమైన ప్రాంతాలను చుడుతుంది. చివరిగా, యాత్రికులను శ్రీలంకకు కూడా తీసుకెళ్లి, రామాయణంతో ముడిపడిన పుణ్య క్షేత్రాలను దర్శింపజేస్తారు.

న్యూఢిల్లీ నుంచి బయలుదేరే ఈ రైలు తొలుత అయోధ్యకు చేరుతుంది. అక్కడి నుంచి హనుమాన్ గార్హి, రామ్ కోట్, కన్ భగవాన్ టెంపుల్, నందిగ్రామ్, సీతామార్హి, జనక్ పూర్, వారణాసి, ప్రయాగ, చిత్రకూట్, నాసిక్, హంపిల మీదుగా రామేశ్వరం వరకూ సాగుతుంది. ఆపై చెన్నై నుంచి శ్రీలంకకు యాత్రికులను విమానంలో చేరుస్తారు. ఈ రైలులో 800 మంది ప్రయాణం చేయవచ్చు. శ్రీలంకకు వెళ్లాలని భావించే వారు ఒక్కో టికెట్ ను రూ. 36,970 పెట్టి కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భోజనం, వసతి, సైట్ సీయింగ్, టూర్ మేనేజర్ వంటి సదుపాయాలన్నింటికీ కలిపే ధరను వసూలు చేస్తారు.









More Telugu News