Telangana: తెలంగాణ ఎన్నికలు.. నేడు నామినేషన్ వేయనున్న ప్రముఖులు వీరే!

  • సీఎం కేసీఆర్, హరీశ్ రావు నామినేషన్ల దాఖలు
  • చివరిరోజున నామినేషన్ వేయనున్న కేటీఆర్
  • 19తో ముగియనున్న నామినేషన్ల గడువు

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ జోరు మొదలైంది. ఈ నెల 19తో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో పలువురు నేతలు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న అన్ని పార్టీలకు సంబంధించి 39 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ నేపథ్యంలో నేడు కూడా పలువురు ప్రముఖులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వారి జాబితా ఇదే..

1) గజ్వేల్‌ లో సీఎం కేసీఆర్ (టీఆర్ఎస్)
2) సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు (టీఆర్ఎస్)
3)పటాన్ చెరులో గూడెం మహిపాల్ రెడ్డి (టీఆర్ఎస్)
4) జహీరాబాద్‌లో మాణిక్ రావ్ (టీఆర్ఎస్)
5)గజ్వేల్‌లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి (కాంగ్రెస్) 
6)సంగారెడ్డిలో జగ్గారెడ్డి (కాంగ్రెస్)
7)నర్సాపూర్‌లో మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి (కాంగ్రెస్) 
8)జహీరాబాద్‌లో మాజీమంత్రి గీతారెడ్డి (కాంగ్రెస్)  
9)నారాయణఖేడ్ లో భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్) 
10)దుబ్బాకలో రఘునందన్ రావ్ (బీజేపీ)
11)మెదక్‌లో పట్లోళ్ల శశిధర్ రెడ్డి (రెబల్)

వీరితో పాటు టీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి ఈ రోజు నామినేషన్లు వేయనున్నారు. అలాగే జగిత్యాల అభ్యర్థి సంజయ్‌కుమార్, కోరుట్ల అభ్యర్థి విద్యాసాగర్‌రావు, చెన్నూరు నుంచి బాల్క సుమన్, మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్‌గౌడ్, నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు.

వీరితో పాటు పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేశ్, ఇల్లందు నుంచి కోరం కనకయ్య, కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి నుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి, బోథ్ నుంచి బాపూరావు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అలాగే రేపు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఈ నెల 19న మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

More Telugu News