California: కాలిఫోర్నియా కార్చిచ్చు.. హృదయ విదారకంగా పరిస్థితి.. పలువురు సజీవ దహనం!

  • కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
  • హాలీవుడ్ నటులుండే ప్రాంతానికీ మంటల విస్తరణ
  • త్రుటిలో తప్పించుకున్న నటుడు గెరార్డ్ బట్లర్
  • ఇప్పటి వరకు 48 మంది సజీవ దహనం

అమెరికాలోని కాలిఫోర్నియాలో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. కార్చిచ్చు కారణంగా నిత్యం మంటలు ఎగసి పడుతున్నాయి. అగ్నికీలలు భయానకంగా ఎగసిపడుతున్నాయి. పట్టణాలు, నగరాలకు కార్చిచ్చు వ్యాపిస్తుండడంతో పరిస్థితి రోజురోజుకు మరింతగా దిగజారుతోంది. కార్లు, ఇళ్లలో ఉన్న వారు మంటల్లో అగ్నికి ఆహుతవుతున్నారు. కాలిఫోర్నియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇటువంటి గుండెలు పిండేసే దృశ్యాలే కనబడుతున్నాయి. ఇళ్లను వదల్లేక కొందరు మంటలకు ఆహుతవుతున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో మరికొందరు సజీవ దహనం అవుతున్నారు. ఇప్పటి వరకు ఇలా 48 మంది ప్రాణాలు కోల్పోయారు.

సహాయక సిబ్బంది ఇప్పటి వరకు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హెలికాప్టర్లు, విమానాల ద్వారా పైనుంచి నీటిని చల్లి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు.  ఏకంగా 9 వేల మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు అహరహం శ్రమిస్తున్నారు. తాజాగా, హాలీవుట్ నటులు నివసించే మాలీబు ప్రాంతానికి కూడా మంటలు విస్తరించాయి. చాలామంది నటీనటుల ఇళ్లు కాలిబూడిదైనట్టు సమాచారం. హాలీవుడ్ ప్రముఖ నటుడు గెరార్డ్ బట్లర్ ఇల్లు మంటలకు ఆహుతైంది. అదృష్టవశాత్తు అతడు మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.  

More Telugu News