GAJA: మళ్లీ బలపడుతోంది... 'గజ' తాజా అప్ డేట్!

  • తగ్గినట్టే తగ్గి ఉద్ధృతమైన తుపాను
  • చెన్నైకి 570 కిలోమీటర్ల దూరంలో 'గజ'
  • ఎల్లుండి తీరాన్ని దాటే అవకాశం

నిన్న కాస్తంత బలహీనపడ్డట్టు కనిపించిన 'గజ' తుపాను, గత రాత్రి నుంచి మళ్లీ ఉద్ధృతంగా మారింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు దిశగా, 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'గజ' నిదానంగా కదులుతూ నాగపట్నం వైపు సాగుతోంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతోంది. ఏ సమయంలోనైనా ఇది దిశ మార్చుకునే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఎల్లుండిలోగా ఇది తీరాన్ని దాటవచ్చని, దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తుపాను తీరానికి సమీపించే కొద్దీ గాలులు, అలల తీవ్రత పెరుగుతుందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, తమిళనాడు తీరం వెంబడి ప్రస్తుతం 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండగా, తుపాను తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.

More Telugu News