rafel deal: రాఫెల్‌ వివాదంపై నేడు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ

  • కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ధరలను పరిశీలించనున్న న్యాయమూర్తులు
  • విపక్షాల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్న కోర్టు
  • కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు డిమాండ్‌  

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వివాదంపై నేడు భారత అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఫ్రాన్స్‌ నుంచి 36 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి భారత్‌ 58 వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిందే. ఈ ఒప్పందం విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం చివరికి సుప్రీం కోర్టుకు చేరింది.

ఈ ఒప్పందానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ధరల వివరాలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయి, న్యాయమూర్తులు ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం పరిశీలించనుంది. విపక్షాల నుంచి స్పందనలను స్వీకరించనుంది. ఈ వివాదాస్పద ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలన్న డిమాండ్ నేపథ్యంలో కోర్టు విచారణ కీలకం కానుంది.

More Telugu News