rajasekhar: డూప్ లేకుండా రిస్క్ చేస్తోన్న సీనియర్ హీరో

  • రాజశేఖర్ హీరోగా 'కల్కి'
  • 2 కోట్లతో భారీ సెట్ 
  • యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ  

'గరుడవేగ' హిట్ తరువాత మరో వైవిధ్యభరితమైన కథ కోసం రాజశేఖర్ చాలా సమయమే తీసుకున్నారు. 'అ!' సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న ప్రశాంత్ వర్మ ఒక కథ వినిపించడంతో, ఆ కథపై నమ్మకంతో రాజశేఖర్ రంగంలోకి దిగారు. ఈ సినిమాకి 'కల్కి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సి.కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 1983 నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక భారీ సెట్ వేశారు. ప్రస్తుతం అందులో రాజశేఖర్ తదితరులపై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ లో రాజశేఖర్ డూప్ లేకుండా రిస్కీ సీన్స్ చేస్తున్నారట. సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ కానుందని అంటున్నారు. పవర్ ఫుల్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి.     

More Telugu News