Tirumala: తిరుమలేశుని పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ

  • నేడు స్వామివారికి పుష్పయాగం
  • 8 టన్నుల పూలతో స్వామికి అలంకరణ
  • పలు ఆర్జిత సేవలు రద్దు

ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వరుని పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆయన సేనాధిపతి విష్వక్సేనుడు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల జయజయధ్వానాల మధ్య వసంత మండపానికి చేరుకున్నారు. అక్కడ భూమిపూజ తరువాత, సేకరించిన పుట్టమన్నుతో యాగశాలకు చేరుకున్న అర్చకులు, వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. పుష్పయాగంలో భాగంగా నేడు ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆపై వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన దాదాపు 8 టన్నుల పూలను స్వామివారికి అలంకరించనున్నారు. పుష్పయాగం కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.

More Telugu News