డిజిటల్ ప్రపంచంలోనూ రాణించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్!

13-11-2018 Tue 21:12
  • బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్
  • వెబ్ సిరీస్ రంగంలోనూ రాణించేందుకు సిద్ధం
  • మంచి కథ కోసం అన్వేషణ ప్రారంభం
వెండితెరపై అగ్ర కథానాయకుడిగా దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్ను వెబ్ సిరీస్‌పై పడిందట. ఇప్పటికే బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ ముందుముందు డిజిటల్ యుగందే హవా కాబట్టి, వెబ్ సిరీస్ రంగంలోనూ రాణించాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. ఇప్పటికే తెలుగులో నిహారికా కొణిదెల, రానా దగ్గుబాటి, నవదీప్, జగపతి బాబు వెబ్ రంగంలోకి అడుగుపెట్టారు.

 హిందీలోనూ మాధవన్, సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి అగ్ర కథానాయకులు సినిమాలతోపాటే వెబ్ సిరీస్‌ రంగంలో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ ఆర్’ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో వెబ్ సిరీస్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఇప్పటికే మంచి కథ కోసం అన్వేషణ కూడా మొదలైందని తెలుస్తోంది.