ram gopal varma: రామ్ గోపాల్ వర్మ ‘భైరవగీత’ లిరికల్ వీడియో విడుదల

  • ‘ఈ బానిస పిడికిలి బిగియాలి..’ అంటూ సాగిన లిరిక్
  • ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వర్మ
  • ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు ‘భైరవగీత’


రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న చిత్రం భైరవగీత నుంచి మరోపాట విడుదలైంది. ‘వందెమాతరం.. వందె మాతరం.. వందె మాతరం.. ఈ బానిస పిడికిలి బిగియాలి..ఆ దొరల గుండెలు బెదరాలి’ అంటూ సాగిన సాంగ్ లిరికల్ వీడియోను వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.

సిరాశ్రీ రాసిన ఈ పాటను గాయకులు రాంకీ, అసిత్ త్రిపాఠి ఆలపించారు. కాగా,  ఈ చిత్రానికి దర్శకుడు సిద్ధార్థ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించిన ఈ చిత్రానికి సంగీతం రవిశంకర్ అందించారు.

More Telugu News