ambika: తెలుగులో ఆ సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను: అంబిక

  • తమిళంలో రజనీ జోడీగా చేశాను
  • తెలుగు రీమేక్ లో నన్నే అడిగారు
  • అదే 'బావా మరదళ్లు' మూవీ

హీరోకైనా .. హీరోయిన్ కైనా తాము వదులుకున్న సినిమా సూపర్ హిట్ అయినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఆ సినిమా చేసి వుంటే బాగుండేదని ఆ తరువాత కూడా అనిపిస్తూ వుంటుంది. అలా తనని బాధపెట్టే సినిమా ఒకటి ఉందంటూ, ఆ సినిమాను గురించి 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో అంబిక చెప్పుకొచ్చారు.

"తమిళంలో రజనీకాంత్ సరసన నేను .. రాధ ఒక సినిమా చేశాము. ఆ సినిమా హిట్ కావడమే కాకుండా అవార్డు కూడా వచ్చింది. ఆ సినిమాను తెలుగులో 'బావా మరదళ్లు' పేరుతో రీమేక్ చేస్తూ, తమిళంలో నేను చేసిన పాత్రనే తెలుగులోను చేయమని అడిగారు. ఆ సమయంలో ఒక కన్నడ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ఉండటంతో డేట్స్ కుదరక ఒప్పుకోలేదు. తెలుగులో శోభన్ బాబు హీరోగా వచ్చిన ఆ సినిమాలో రాధిక .. సుహాసిని చేశారు. ఈ సినిమా టీవీలో వచ్చినప్పుడల్లా 'అయ్యో ఇంత మంచి సినిమాను వదులుకున్నానే' అని ఏడుపొస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.          

More Telugu News