mammootty: 'యాత్ర'లో రాజకీయ నాయకురాలిగా అనసూయ

  • వైఎస్ బయోపిక్ గా 'యాత్ర'
  • చాలావరకూ చిత్రీకరణ పూర్తి
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా 'యాత్ర' సినిమా నిర్మితమవుతోంది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డిగా ఆయన లుక్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది.

ఈ సినిమాలో రాజకీయ నాయకురాలిగా అనసూయ కనిపించనుంది. అందుకు సంబంధించి లొకేషన్ లోని ఒక పిక్ ను ఆమె షేర్ చేసింది. కాకపోతే తాను పోషిస్తున్నది ఏ రాజకీయనాయకురాలి పాత్ర అనే విషయాన్ని మాత్రం ఆమె రివీల్ చేయలేదు. వై.ఎస్.పాదయాత్ర ... ప్రజల ఆదరాభిమానాలు .. ప్రత్యర్థుల వ్యూహాలు .. వై.ఎస్.ప్రమాణ స్వీకారం మొదలైన అంశాలు ఈ బయోపిక్ లో వుంటాయని అంటున్నారు. త్వరలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  

More Telugu News