KCR: కేసీఆర్ కూడా ఓ అభ్యర్థే.. కుల సంఘాల సమావేశాలకు హాజరైతే నోటీసులిస్తాం: ఎన్నికల అధికారి రజత్ కుమార్

  • ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే నోటీసులు
  • తొలి రోజు 43 నామినేషన్లు దాఖలు
  • సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్

తెలంగాణలో కుల సంఘాల మీటింగుకు టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కానీ, ఆ పార్టీ నేతలు కానీ హాజరు కాకూడదని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. కేసీఆర్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి మాత్రమేనని, కుల సంఘాల సమావేశాలకు హాజరైతే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద నోటీసులు తప్పవని  పేర్కొన్నారు.

ఎన్నికల ఏర్పాట్లపై రజత్ కుమార్ మాట్లాడుతూ.. తొలి రోజు 43 నామినేషన్లు దాఖలైనట్టు చెప్పారు. నామినేషన్ విడుదలైనప్పటి నుంచి పది రోజులు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి  ఖర్చును పరిగణించనున్నట్టు చెప్పారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను వారం రోజుల్లో ఇవ్వకుంటే మొత్తం ఖర్చును అభ్యర్థి ఖర్చు గానే పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని 13  సమస్యాత్మక నియోజక వర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు.

More Telugu News