GAJA: అల్లకల్లోలంగా విశాఖ సముద్రతీరం... జలవిన్యాసాల నిలిపివేత

  • దూసుకొస్తున్న 'గజ' తుపాను
  • తీరంపై విరుచుకుపడుతున్న కెరటాలు
  • దక్షిణ కోస్తాపై అధిక ప్రభావం చూపే అవకాశం

దూసుకొస్తున్న 'గజ' తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను భయపెడుతుండగా, దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖ రుషికొండ బీచ్‌ లో కెరటాలు ఉగ్రరూపంతో తీరంపై విరుచుకుపడుతున్నాయి. వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో పర్యాటక శాఖ స్పీడ్ బోట్లను, ప్రైవేట్‌ వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కయాకింగ్‌ తదితర జల విన్యాసాలను అధికారులు ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేశారు.

ఇప్పటికే మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. వేటకు వెళ్లిన వారు కూడా వెనక్కు తిరిగి వస్తున్నారు. కాగా, దక్షిణ కోస్తా పరిధిలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలపై ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

More Telugu News