raviteja: దూసుకుపోతోన్న 'అమర్ అక్బర్ ఆంటోని' ట్రైలర్

  • నిన్న విడుదలైన ట్రైలర్ 
  • ఇంతవరకూ 4 మిలియన్ల వ్యూస్
  • యాక్షన్ కామెడీగా సాగే కథ

గతంలో శ్రీను వైట్ల .. రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ విజయాలను నమోదు చేయడంతో, ఇప్పుడు అందరి దృష్టి 'అమర్ అక్బర్ ఆంటోని'పైనే వుంది. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

"ఈ ప్రపంచంలో శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోనివాళ్లు కొందరైతే, శక్తిమేరకు నయవంచన చేసేవాళ్లు కోకొల్లలు" అంటూ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంతవరకూ ఈ ట్రైలర్ కి 4 మిలియన్ల వ్యూస్ లభించినట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. యాక్షన్ ను .. కామెడీని కలిపి శ్రీను వైట్ల నడిపించిన తీరు, తమన్ సంగీతం .. రవితేజ డిఫరెంట్ లుక్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.     

More Telugu News