Newzealand: వికెట్ల మధ్య చిరుతలా పరుగులు పెట్టిన పాక్ బ్యాట్స్‌మన్

  • న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఘటన
  • ఒక్క బంతికి ఐదు పరుగులు సాధించిన ఫహీం
  • ఫిట్‌నెస్‌కు ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో పాక్ ఆటగాడు ఫహీం అష్రాఫ్ అద్భుతం చేశాడు. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 24 ఏళ్ల ఫహీం ఒక్క బంతికే ఐదు పరుగులు సాధించాడు. 49వ ఓవర్‌లో  కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని ఫహీం బలంగా కొట్టాడు.

బంతి బౌండరీ లైన్ వద్దకు  వెళ్లడంతో అష్రాఫ్ వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టాడు. సహచర ఆటగాడు అసీఫ్ అలీతో వికెట్ల మధ్య చకచకా తిరిగేశాడు. అలా మొత్తంగా ఐదు పరుగులు సాధించడం విశేషం. సాధారణంగా మూడు పరుగులు సాధించడమే కష్టం.. అలాంటిది చిరుతలా పరుగులు పెట్టి ఐదు పరుగులు సాధించడంతో అతడి ఫిట్‌నెస్‌కు అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, ఐదు పరుగులు తీసి అలసిపోయిన అష్రాఫ్ తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.  కాగా, ఈ మ్యాచ్‌లో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి  279 పరుగులు చేసింది. అయితే, న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 6.5 ఓవర్ వద్ద వర్షం పడడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

More Telugu News