Ileana: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వ్యక్తిగత జీవితం గురించి ఇలియానా 
  • భారీ రేటు పలికిన 'ఎన్టీఆర్' బయోపిక్
  • నిఖిల్ 'ముద్ర' విడుదల తేదీ ఖరారు

*  'నా వ్యక్తిగత జీవితం గురించి నేనెందుకు మాట్లాడాలి?' అంటూ ప్రశ్నిస్తోంది కథానాయిక ఇలియానా. 'నా గురించి రకరకాలుగా ప్రచారం చేశారు. నాకు పెళ్లయిందని, గర్భవతినని.. రకరకాలుగా ప్రచారం చేశారు. అయినా నా వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడను' అని చెప్పింది ఇలియానా    
*  బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా క్రిష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ కి అమెరికాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఈ చిత్రం రెండు భాగాల యూఎస్ ప్రదర్శన హక్కులను 'యూఎస్ తెలుగు మూవీస్' సంస్థ 19.8 కోట్ల భారీ ధరను ఆఫర్ చేసి సొంతం చేసుకుంది.
*  యువ కథానాయకుడు నిఖిల్ నటిస్తున్న 'ముద్ర' చిత్రాన్ని డిసెంబర్ 28న విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. టీఎస్ సంతోష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది.

More Telugu News