Mavoists: భారీ రిగ్గింగ్‌కు ప్రభుత్వం యత్నిస్తోంది.. ఎన్నికలను బహిష్కరించాలి: మావోల పిలుపు

  • పెద్ద స్థాయిలో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోంది
  • రిగ్గింగ్ కుట్రను బహిర్గతం కాకుండా చూస్తోంది
  • ప్రజలు ఓట్లేసేందుకు సిద్ధంగా లేరు

ప్రజా పరిరక్షణ పేరుతో బూటకపు ఎన్నికలకు చత్తీస్‌గడ్‌లో కుట్ర జరుగుతోందని.. బస్తర్‌లో భారీ రిగ్గింగ్‌కు ప్రభుత్వం యత్నిస్తోందంటూ మావోయిస్టులు ఆరోపించారు. ఈ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ జరగనంత పెద్ద స్థాయిలో అధికార బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని మావోలు లేఖలో ఆరోపించారు.

ప్రసార మాద్యమాలు, ప్రచార యంత్రాంగాలను ప్రభుత్వం అదుపులో ఉంచుకుని రిగ్గింగ్ కుట్రను బహిర్గతం కాకుండా చూస్తోందని తెలిపారు. బస్తర్‌లో ప్రజలు ఓట్లు వేసేందుకు సిద్ధంగా లేరని.. తమ సమస్యలను జనతన సర్కారు సమక్షంలోనే పరిష్కరించుకుంటారన్నారు. పోలీసులు సంతకు వెళ్లిన ప్రజలను, పనులపై బయటకు వెళ్లిన ప్రజలను కొట్టడం, భయపెట్టడం, అరెస్ట్ చేయడం, కాల్చిచంపి సుల్కన్‌తోంగ్, బైరాంగఢ్‌లో చేసినట్టుగా ఎన్‌కౌంటర్ కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు.

More Telugu News