rajamouli: రాజమౌళి మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఇదేనా?

  • వర్కింగ్ టైటిల్ ‘ఆర్ఆర్ఆర్’
  • అసలు టైటిల్ ‘రామ రావణ రాజ్యం’?
  • ‘తారక్ రామ్’ అనే మరో టైటిల్ చక్కర్లు 

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ ‘ఆర్ఆర్ఆర్’. ఆ మూడు ‘ఆర్’ లకు అర్థం రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ అని అనుకున్నారు.

ఆ విషయం పక్కనబెడితే.. ‘ఆర్ఆర్ఆర్’ అంటే ‘రామ రావణ రాజ్యం’ అనేది అసలు టైటిల్ కావచ్చేమోననే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల వేదికగా వెలువడుతున్నాయి. అయితే, ‘తారక్ రామ్’ అనే మరో టైటిల్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

More Telugu News