chattisgarh: చత్తిస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు.. ఎన్నికలకు ఒక రోజు ముందు కలకలం!

  • ఒక మావోయిస్టు హతం...పోలీసుల అదుపులో మరొకరు
  • రెండు రైఫిళ్లు, ఇతర ఆయుధాలు స్వాధీనం
  • బీజాపూర్‌ జిల్లా బెడ్రే ప్రాంతంలో ఘటన

చత్తీస్‌గడ్‌ అటవీ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. బీజాపూర్‌ జిల్లా బెడ్రే ప్రాంతంలో ఈ ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఘటనలో ఒక మావోయిస్టు హతంకాగా, మరొకరిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

మరికొందరు మావోయిస్టులు పరారు కావడంతో వారిని పట్టుకునేందుకు అదనపు సిబ్బందిని రప్పిస్తున్నారు. ఘటనా స్థలి నుంచి రెండు రైఫిళ్లు, మరికొన్ని ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కాంకేర్‌ జిల్లా కొయిబెడే ప్రాంతంలో జరిగిన ఐఈడీ పేలుడులో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను గాయపడ్డాడు. ఈ పేలుడు అనంతరం మావోయిస్టులు కాల్పులు జరపడంతో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు తిప్పికొట్టారు.

More Telugu News