Chandrababu: చంద్రబాబు-స్టాలిన్ భేటీతో వణుకుతున్న బీజేపీ నేతలు.. మోదీ పాలనకు ఇక చెక్: కనిమొళి

  • బీజేపీ నేతల గుండెల్లో దడ మొదలైంది
  • మోదీ పాలనకు స్వస్తి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి
  • జాతీయ పార్టీలన్నీఏకం కావాలి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు-డీఎంకే అధినేత స్టాలిన్ భేటీపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. వీరిద్దరి భేటీతో కమలనాథుల గుండెల్లో దడ మొదలైందని అన్నారు. మత శక్తులను వెనకుండి నడిపిస్తున్న మోదీ పాలకు ఇక చరమగీతం తప్పదన్నారు. ఎన్‌డీయే పాలనకు చివరి రోజులు వచ్చేశాయన్నారు. మోదీ పాలనకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీ నేతల గుండెల్లో వణుకు మొదలైందన్నారు.

దేశంలో సెక్యులరిజాన్ని కాపాడే సమయం ఆసన్నమైందని, రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  శనివారం స్టాలిన్‌ను కలిసిన తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల కేంద్ర పరిశీలకుడు సంజయ్‌దత్ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చొరవతో ఎన్డీయే వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు త్వరలో స్టాలిన్‌ను రాహుల్ గాంధీ కలవబోతున్నట్టు చెప్పారు.  

More Telugu News