farooq: చిన్న వాడివైనా అవకాశం ఇచ్చా... పార్టీకి మంచి పేరు తీసుకురా: కిడారి శ్రవణ్ కు చంద్రబాబు సూచన

  • ఏపీ కేబినెట్ల లో ఫరూక్, కిడారి శ్రవణ్ లకు స్థానం
  • సమచర మంత్రులు, జిల్లా నేతలతో సమన్వయంతో పని చేయాలంటూ చంద్రబాబు సూచన
  • శాసనసభలో ప్రభుత్వ విప్ గా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా పేరు ఖరారు

మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్ కు ఏపీ కేబినెట్ లో స్థానం లభించింది. శాసనమండలి ఛైర్మన్ ఫరూక్, కిడారి శ్రవణ్ లకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపటి క్రితం ప్రకటించారు. సహచర మంత్రులతో పాటు జిల్లా నేతలతో సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా ఇద్దరికీ చంద్రబాబు సూచించారు. రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న కిడారి శ్రవణ్ కు ఈ సందర్భంగా చంద్రబాబు పలు సూచనలు చేశారు. చిన్నవాడివైనా అవకాశం ఇస్తున్నానని... వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీకి మంచి పేరు తీసుకురావాలని శ్రవణ్ కు సూచించారు.

ఫరూక్, శ్రవణ్ లు మంత్రులుగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో శాసనమండలి ఛైర్మన్ పదవికి ఫరూక్ రేపు రాజీనామా చేయనున్నారు. మరోవైపు, శాసనసభలో ప్రభుత్వ విప్ గా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా పేరును చంద్రబాబు ఖరారు చేశారు.

ఈ సందర్భంగా మైనార్టీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించే విషయంలో జరిగిన జాప్యానికి గల కారణాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి వివరించారు. మంత్రి పదవులు దక్కని ముస్లిం ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తానని చెప్పారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటానికి మద్దతుగా ముస్లింలను సమీకరించుకుని వెళ్లాలని ఈ సందర్భంగా నేతలకు మార్గనిర్దేశం చేశారు. 

More Telugu News