kamal: 'భారతీయుడు 2'లో దుల్కర్ సల్మాన్

  • 'భారతీయుడు' సీక్వెల్ కి సన్నాహాలు 
  • కమల్ సరసన కాజల్ 
  • జనవరి నుంచి సెట్స్ పైకి   

కమలహాసన్ కెరియర్లోను .. శంకర్ కెరియర్లోను 'భారతీయుడు' సినిమాకి ప్రత్యేకమైన స్థానం వుంది. చాలాకాలం క్రితం వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి శంకర్ సిద్ధమవుతున్నాడు.

ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కమల్ సరసన కథానాయికగా కాజల్ ను ఎంపిక చేశారు. ఇక ఓ ముఖ్యమైన పాత్రకిగాను మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. ప్రస్తుతం శంకర్ ఈ నెల 29వ తేదీన '2.ఓ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. జనవరి నుంచి 'భారతీయుడు 2'ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.     

More Telugu News