charan: 'వినయ విధేయ రామ' ఆడియో వేడుక అక్కడేనట!

  • టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న చరణ్ మూవీ 
  • వచ్చేనెల 2వ వారం నుంచి పాటల చిత్రీకరణ 
  • 4వ వారంలో ఆడియో వేడుక 

బోయపాటి - చరణ్ కాంబినేషన్లో 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. మిగిలిన పాటలను డిసెంబర్ 2వ వారంలో చిత్రీకరించనున్నారు. డిసెంబర్ 4వ వారంలో ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన పాటల విడుదలకి వైజాగ్ వేదిక అయితే బాగుంటుందని భావిస్తున్నారట.

గతంలో అక్కడ ఆడియో రిలీజ్ జరుపుకున్న 'రంగస్థలం' ఘన విజయాన్ని అందుకుంది. ఆ సెంటిమెంట్ కారణంగా 'వినయ విధేయ రామ' ఆడియోను అక్కడే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. త్వరలోనే డేట్ ను ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చరణ్ కి బోయపాటి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి మరి.     

More Telugu News