vijay: 150 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'సర్కార్'

  • మురుగదాస్ తో విజయ్ హ్యాట్రిక్ హిట్ 
  • మూడోసారి 150 కోట్ల క్లబ్ లోకి విజయ్ 
  • సంబరాలు చేసుకుంటున్న అభిమానులు  

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. మురుగదాస్ - విజయ్ లకు హ్యాట్రిక్ హిట్ పడినట్టేననే టాక్ వినిపించింది. పొలిటికల్ డ్రామా నేపథ్యంగా నిర్మితమైన ఈ సినిమా, కొన్ని వివాదాలను ఎదుర్కొంటూనే వుంది. అయినా వసూళ్ల పరంగా దూసుకుపోతూనే వుంది.

తొలి రెండు రోజుల్లోనే 100 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 150 కోట్ల క్లబ్ లోకి విజయ్ అడుగుపెట్టడం ఇది మూడోసారి. గతంలో ఆయన నటించిన 'తెరి' .. మెర్సల్' సినిమాలు ఈ ఫీట్ ను సాధించాయి. సౌత్ లో చాలా కష్టతరమైన ఈ ఫీట్ ను విజయ్ మూడోసారి సాధించడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మురుగదాస్ కూడా మరోమారు తన సత్తా చూపించాడని అంటున్నారు.    

More Telugu News