balakrishna: 'బొబ్బిలి పులి' గా బాలకృష్ణ అదరగొట్టేస్తున్నాడట!

  • ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగినదిగా 'బొబ్బిలిపులి'
  • మాస్ ఆడియన్స్ నుంచి నీరాజనాలు 
  • అదే పాత్రలో మెప్పించనున్న బాలకృష్ణ  

ఎన్టీ రామారావు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'బొబ్బిలి పులి' ఒకటిగా కనిపిస్తుంది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో చాలాకాలం క్రితం వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. మాస్ ఆడియన్స్ ఈ సినిమాకి నీరాజనాలు పట్టేశారు. అలాంటి ఈ సినిమాలోని సన్నివేశాలను దర్శకుడు క్రిష్ .. 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలోని ఒక భారీ డైలాగ్ ను అప్పట్లో ఎన్టీఆర్ సింగిల్ టేక్ లో చెప్పేశారట. అదే డైలాగ్ ను బాలకృష్ణ కూడా సింగిల్ టేక్ లో చెప్పేశారట. తాజాగా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించగా సెట్ లోని వాళ్లంతా క్లాప్స్ కొట్టేశారని అంటున్నారు. 'బొబ్బిలి పులి'గా బాలకృష్ణ అదరగొట్టేశాడని చెబుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.      

More Telugu News