Andhra Pradesh: విజయనగరంలో 12 నుంచి ప్రజాసంకల్పయాత్ర.. పాల్గొననున్న వైఎస్ జగన్!

  • ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పార్టీ శ్రేణులు
  • సోమవారం పాయకపాడులో మొదలు
  • గాయం నుంచి కోలుకున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్ర ఈ నెల 12న(సోమవారం) పున:ప్రారంభం అవుతుందని పార్టీ శ్రేణులు తెలిపాయి. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడికత్తి దాడి ఘటనలో కోలుకున్న నేపథ్యంలో జగన్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. దాడికి ముందు జగన్ విజయనగరంలోని మక్కువ మండలం పాయకపాడు వరకూ పాదయాత్ర చేపట్టారు.

సోమవారం పాయకపాడు నుంచి మొదలుకానున్న ప్రజాసంకల్పయాత్ర, 13వ తేదీన పార్వతీపురం నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో జగన్ కు ఘనస్వాగతం పలికేందుకు నియోజకవర్గ నేతలు, వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 25న హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందేలకు వాడే కత్తితో దాడి చేశాడు.

ఈ ఘటనలో గాయపడ్డ జగన్ హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకున్నారు. మరోవైపు నిందితుడు శ్రీనివాసరావును ఈ నెల 23 వరకూ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ విశాఖపట్నంలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News