Deepak Pawar: నామినేషన్ డిపాజిట్ మొత్తాన్ని చూసి అవాక్కయిన రిటర్నింగ్ అధికారి!

  • విరాళాల రూపంలో రూ.10 వేల సేకరణ
  • నాణేలను రిటర్నింగ్ అధికారి ముందు పోసిన దీపక్
  • సిబ్బందితో లెక్క పెట్టించిన రిటర్నింగ్ అధికారి

నామినేషన్ వేసేందుకు మందీ మార్బలంతో వెళ్లిన ఓ అభ్యర్థి పూచీకత్తు కింద కట్టాల్సిన రూ.10 వేలను చెల్లించారు. అయితే అది చూసిన రిటర్నింగ్ అధికారి అవాక్కయ్యారు. దానికి కారణం ఆ అభ్యర్థి రూ.10 వేలను చిల్లర రూపంలో అందించడమే. ఇదీ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన ఆసక్తికర సన్నివేశం. ప్రస్తుతం అక్కడ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

స్వర్ణిమ్ భారత్ ఇంక్విలాబ్ పార్టీ నేత అయిన దీపక్ పవార్ ఇండోర్-3 శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్ నిమిత్తం పూచీకత్తు కోసం రూ.10 వేలను ప్రజల నుంచి విరాళాల రూపంలో దీపక్ సేకరించారు. వాటిని నోట్లుగా మార్చే వెసులుబాటు లేకపోవడంతో ఆ సొమ్మును అలాగే తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారి ఎదుట పోశారు. దీంతో చేసేదేమీలేక రిటర్నింగ్ అధికారి తన సిబ్బందితో లెక్కపెట్టించారు. అయితే సిబ్బందికి ఆ సొమ్మును లెక్కపెట్టేందుకు గంటన్నర పట్టింది.

More Telugu News